షూటింగ్‌లో గురుకుల బాలికల సత్తా,రాష్ట్ర స్థాయికి పది మంది
•చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ •గుడుగుండ్లపాలెం బీసీ గురుకులానికి గర్వకారణం
హుజుర్నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 22:చదువుతో పాటు క్రీడల్లోనూ బాలికలు తమ ప్రతిభను చాటగలరని గుడుగుండ్లపాలెం బీసీ గురుకులం విద్యార్థినులు నిరూపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నిర్వహించిన పాఠశాల క్రీడా సమాఖ్య రైఫిల్ షూటింగ్ పోటీల్లో హుజూర్నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలంలోని గుడిగుంట్ల పాలెం గురుకులానికి చెందిన పది మంది విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 17 సంవత్సరాల లోపు,19 సంవత్సరాల లోపు విభాగాల్లో విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం విశేషం.
17 సంవత్సరాల లోపు బాలికల విభాగంలో తేజ, నిహారిక,హాసిని,ప్రణీత, నవ్య,గాయత్రి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 19 సంవత్సరాల లోపు విభాగంలో ఆషిత,సహస్ర, నవ్యమంజలి,సౌమ్య రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
గురుకుల విద్యతో పాటు క్రీడల్లోనూ బాలికలకు అందుతున్న ప్రోత్సాహానికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి,ఏటీపీ కె.ఎస్. విజయం,డీడబ్ల్యూ ఇందిర,వ్యాయామ ఉపాధ్యాయులు ప్రియదర్శిని,అరుణ,ఆరోగ్య పర్యవేక్షకురాలు ఆర్.శిరీష,ఉపాధ్యాయ బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి గురుకులానికి,ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.