షాబాద్ లో ఘనంగా వినాయక పూజలు
షాబాద్ లో ఘనంగా వినాయక పూజలు ప్రజావాణి రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్16 షాబాద్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని షాబాద్‌లో భక్తిశ్రద్ధలతో బడా గణేష్ దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాన్ని 11 రోజులు విజయవంతం చేయడంలో యువజన సంఘం సభ్యులు కీలక పాత్ర...