prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:32 am Digital Edition : PRAJA VANI

షాబాద్‌లో మండల స్థాయి సమావేశం

షాబాద్‌లో మండల స్థాయి సమావేశం

– అభివృద్ధి, పాలన అంశాలపై సమీక్ష.. పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య మధుసూదన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజావాణి

ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి జి. వెంకట నారాయణ అధ్యక్షతన, ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు సమావేశానికి ,. మండల స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, గ్రామాల్లోని సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు.ఈ కార్యక్రమంలో సర్దార్‌ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్,తహసీల్దార్ అన్వర్‌,మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు హాజరయ్యారు.