శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాయకుడికి ప్రత్యేక పూజలు

ఘట్కేసర్, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): శివరెడ్డి గూడా లో శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పండుగను జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువత ఐక్యతతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు....