prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 6:23 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాయకుడికి ప్రత్యేక పూజలు

ఘట్కేసర్, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): శివరెడ్డి గూడా లో శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి నైవేద్యం సమర్పించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పండుగను జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువత ఐక్యతతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కొంతం రామ్‌రెడ్డి, కొంతం అంజిరెడ్డి, కొంతం నర్సింహారెడ్డి, కొంతం అశోక్‌రెడ్డి, కొంతం వెంకట్‌రెడ్డి, కొంతం ఓంకార్‌రెడ్డి, మిర్యాల సతీష్‌ యాదవ్, బి. సునీల్‌ గౌడ్, కొంతం శివాస్‌రెడ్డి, కొంతం ఆకాష్‌రెడ్డి, దయాల రామ్, దయాల శ్యామ్, ఎన్. రామకృష్ణ, మిర్యాల అరవింద్, రొక్కం చిరు, షేక్ సమీర్, సాలేంద్రం ఓంకార్‌ యాదవ్, యేంద్ర సాయిరామ్‌ తేజ్, మాదిరెడ్డి రిత్విక్‌రెడ్డి, సాలేంద్రం కిరణ్‌కుమార్‌ యాదవ్, యేంద్ర అర్జున్, మాదిరెడ్డి హర్షిత్‌రెడ్డి, తిరునగరి జ్ఞాన కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.