శ్రీ సాయి యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డూలకు వేలం పాట

అన్నోజిగూడ, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అన్నోజిగూడ ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డూలు, పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పించారు. వినాయకుడి లడ్డూలకు నిర్వహించిన వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్ద లడ్డూను వడ్లకొండ ప్రశాంత్ రూ.56 వేలతో, చిన్న లడ్డూను వింద్రవత్ రవి రూ.43 వేలతో దక్కించుకున్నారు. అలాగే పూలు, పండ్లను నానావత్ దుర్గాప్రసాద్ రూ.30 వేలతో...