శ్రీ సాయి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు

పోచారం, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సాయి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గంధమాల రాజశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గుబ్బ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, జ్ఞానం–శుభానికి ప్రతీకగా భావించే శ్రీ గణేశుడికి యువత ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు...