prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 10:05 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

శ్రీ సాయి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు

పోచారం, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సాయి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గంధమాల రాజశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గుబ్బ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, జ్ఞానం–శుభానికి ప్రతీకగా భావించే శ్రీ గణేశుడికి యువత ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని యువత సూచించారు. కార్యక్రమంలో శ్రీ సాయి యువజన సంఘం సభ్యులు, స్థానిక యువకులు పాల్గొన్నారు.