శ్రీ సరస్వతి యువజన సంఘం వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చామకూర మహేందర్ రెడ్డి
మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలో శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని చామకూర మహేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చామకూర మహేందర్ రెడ్డికి శ్రీ సరస్వతి యువజన సంఘం కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండపం వద్ద నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలను ఆయన పరిశీలించి, యువజన సంఘం సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువజన సంఘం సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దండు ఓంరాజు, దండు శ్రీకాంత్, డప్పు జీవన్, నాను, ప్రసాద్, గిరి, జితేందర్, ప్రభాకర్, నరేష్, డప్పు శంకర్‌తో పాటు శ్రీ సరస్వతి యువజన సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.