prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 11:40 am Digital Edition : PRAJA VANI

శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ
-భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు,

పెద్దవంగర;సెప్టెంబర్18 ప్రజావాణి
మండలంలో వడ్డేకొత్తపల్లి శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అనంతరం భక్తులకు యూత్ సభ్యులు మరియు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు..ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని చాటుతున్నాయని పేర్కొన్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు, డాక్టర్ కుమ్మరి రామ్మూర్తి,బారాజు ఉపేందర్, పాక అనిల్ కుమార్, తంగళ్ళపల్లి కిరణ్ చారి, కుమ్మనబోయిన సంపత్, సింగిటపు రమేష్, కుమ్మరి లక్ష్మణ్, వెల్మ బీరన్న, కొమ్మనబోయిన వెంకన్న, తుప్పతూరి శోభన్ బాబు, ప్రశాంత్, రాము, రిషికేష్, వశీకర్, బన్నీ, రతన్, వర్షిత్ వీక్షిత్,ప్రజాప్రతినిధులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.