శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల ప్రారంభం – పూజా కార్యక్రమంలో పాల్గొన్న విగ్రహ దాతలు కోడి వెంకన్న-సుష్మ దంపతులు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్గొండ జిల్లా చండూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభ రోజున దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో విగ్రహ దాతలు కోడి వెంకన్న-సుష్మ దంపతులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని, ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు ఉంటాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.