శ్రీ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం పాల్గొన్న ముల్లి పావని జంగయ్య

ఘట్కేసర్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి): ఘట్కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ మార్కెట్‌లో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ సభ్యులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు, భక్తులు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం...