prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 9:31 pm Digital Edition : SHEKARREDDY PATANCHERUV

శ్రీవరసిద్ధి వినాయకుడికి ఘనంగా పూజలు

*

అమీన్‌పూర్‌ మాజీ ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌ మంజుల చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

 

బీరంగూడ,సెప్టెంబర్‌ 14 (ప్రజావాణి):

బీరంగూడలో శ్రీ వరసిద్ధి వినాయక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమీన్‌పూర్‌ మాజీ ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌ మంజుల చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.