prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 10:07 pm Digital Edition : RAJU NANGUNOOR

శ్రీనివాస్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు KSR కిట్ల పంపిణీ

ప్రజావాణి, నంగునూరు, సెప్టెంబర్ 07:

నంగునూరు మండలం ఖానాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ కీ.శే. కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు.శ్రీనివాస్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన భార్య సువర్ణ, కుమార్తెలు, అల్లుళ్లు ఉదయశ్రీ–సంతోష్ రెడ్డి, సునీత–మహిపాల్ రెడ్డి, కుమారుడు కోడలు వైశాలి–అంజి రెడ్డి ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 38 మంది విద్యార్థులకు KSR కిట్లను పంపిణీ చేశారు.ఈ కిట్లలో స్కూల్ బ్యాగ్, ప్యాడ్ బుక్స్, పెన్నులు, జామెంట్రీ బాక్స్ తదితర విద్యా సామగ్రిని అందజేశారు. విద్యార్థుల చదువుకు తోడ్పడాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.తమ కుటుంబ సభ్యుడి జ్ఞాపకాన్ని సేవా కార్యక్రమాల ద్వారా కొనసాగిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా సహకారం అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.