prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 1:23 pm Digital Edition : PRAJA VANI

శివశక్తి యూత్ లడ్డూను వేలంపాటలో కైవసం చేసుకున్న రామాయపల్లి సర్పంచ్ బాగానొల్ల రేణుక తిరుపతి

*శివశక్తి యూత్ లడ్డూను వేలంపాటలో కైవసం చేసుకున్న రామాయపల్లి సర్పంచ్ బాగానొల్ల రేణుక తిరుపతి*
చిన్నశంకరంపేట, సెప్టెంబర్25, మన ప్రజావాణి:వినాయక నవరాత్రులలో భాగంగా చిన్నశంకరంపేట మండల పరిధిలోని రామాయపల్లి గ్రామ శివశక్తి యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నవరాత్రులు , భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న ఆది దేవుని వినాయకుని లడ్డూను బాగాన్నోల్ల రేణుక తిరుపతి వేలంలో కైవసం చేసుకున్నారు. అనంతరం రామయపల్లి సర్పంచ్ బాగాన్నోల రేణుక తిరుపతి మాట్లాడుతూ వేలంలో సొంతం చేసుకున్న లడ్డును బిఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ కాంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు మెదక్ ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలకు పంపిణీ చేశామని తెలిపారు. నిత్యం ప్రజాసేవలో ప్రజల మధ్యనే ఉంటూ కష్ట సుఖాలలో పాలుపంచుకుంటున్న కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు గణనాథుడు ఆశీస్సులతో మెదక్ ఎమ్మెల్యేగా ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆ భగవంతున్ని ప్రార్థించామని సర్పంచ్ తెలిపారు.