శాంతిభద్రతల నేపథ్యంలో వివిధ గ్రామాల్లో ఎల్కతుర్తి నూతన సీఐ విస్తృత పర్యటనలు.

శాంతిభద్రతల నేపథ్యంలో వివిధ గ్రామాల్లో ఎల్కతుర్తి నూతన సీఐ విస్తృత పర్యటనలు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక భద్రతా చర్యలు. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ కే.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు,పర్యటనలు కొనసాగుతున్నాయి. ఎల్కతుర్తి, ముల్కనూర్,వంగర తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలను సందర్శిస్తూ గ్రామ సర్పంచులు,ప్రజాప్రతినిధులు,వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...