శంకుస్థాపనలో ఉన్న పేరు.. ప్రారంభోత్సవంలో మాయం!

    మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్‌ ఉల్లంఘన...రాజ్యాంగ హోదాకు అవమానమా? అధికారుల నిర్లక్ష్యమా?   కేసముద్రం, ఆగస్టు 31 ప్రజావాణి.   ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రులకు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కల్పించాల్సిన ‘ప్రోటోకాల్’ కేవలం ఒక మర్యాద మాత్రమే కాదు.. అది రాజ్యాంగబద్ధమైన హక్కు. అయితే, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నేడు జరిగిన ప్రభుత్వ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గౌరవ మహిళా మంత్రి కొండా సురేఖ పట్ల...