వైద్యం కోసం పేదలు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాకూడదు- ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం -ఓహోఇండియా ఆరోగ్య సంరక్షణ యాజమాన్యం
ప్రైమరీ సభ్యుడికి రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా రక్షణ బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి) వైద్యం కోసం అప్పులు చేసే పరిస్థితి ఏ పేద కుటుంబానికీ రాకూడనే లక్ష్యంతో, పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య తెలిపారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఓహోఇండియా హెల్త్ బెనిఫిట్స్ అకౌంట్ ద్వారా సభ్యులకు పలు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఏడాదికి 24 సార్లు నగదు రహిత...