వైఎస్ జగన్ గారి తో డాక్టర్ దద్దాల భేటీ
ప్రజావాణి దినపత్రిక మార్కాపురం జిల్లా కనిగిరి సెప్టెంబర్ 30
వైయస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలు మరియు ఐడి కార్డుల పంపిణీ,పార్టీ బలోపేతానికి సంబందించి పలు కీలక అంశాల గురించి వైయస్ జగన్ గారితో ఆయన చర్చించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో 135 పంచాయతీలు, 6 జెడ్పీటీసీలు,75 ఎంపీటీసీలు,మున్సిపాలిటీ 32 వార్డులలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ప్రత్యర్థులకు దీటుగా బలమైన అభ్యర్థులను బరిలో దించాలని,గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కస్టపడి పనిచేయాలని,అన్ని విధాలుగా పార్టీ, నేను అండగా నిలపడతామని వైయస్ జగన్ భరోసా ఇచ్చినట్లు ఒక ప్రకటనలో దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు..