వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన యుగపురుషుడు: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

పోరుమామిళ్ల: సెప్టెంబర్ 2 ప్రజావాణి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం పోరుమామిళ్ల మండలంలో వైఎస్ఆర్ విగ్రహాలకు మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోరుమామిళ్లలోని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి, చల్లగిరి గల దేవస్థానం సమీపంలోని వైయస్సార్ ఆలయంలోని విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు.అనంతరం సిద్ధవరం పంచాయతీ అగ్రహారం గ్రామం,కొరపాటి పల్లి పంచాయతీ కాలువ కట్ట దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి...