prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 4:23 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన యుగపురుషుడు: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

పోరుమామిళ్ల: సెప్టెంబర్ 2 ప్రజావాణి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం పోరుమామిళ్ల మండలంలో వైఎస్ఆర్ విగ్రహాలకు మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోరుమామిళ్లలోని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి, చల్లగిరి గల దేవస్థానం సమీపంలోని వైయస్సార్ ఆలయంలోని విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు.అనంతరం సిద్ధవరం పంచాయతీ అగ్రహారం గ్రామం,కొరపాటి పల్లి పంచాయతీ కాలువ కట్ట దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, మాట్లాడుతూ.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, పావలా వడ్డీకే రుణాలు,రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ ఈరోజు ఆయనను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఒక నాయకుడు చనిపోతే తట్టుకోలేక వందలాదిమంది అభిమానులు గుండెలు ఆగి మరణించిన చరిత్ర ప్రపంచంలోనే ఎక్కడా లేదని, వైఎస్ఆర్ ఒక అరుదైన యుగపురుషుడని కొనియాడారు. తండ్రికి తగ్గ తనయునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేశారని నాగార్జున రెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని,సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని మండిపడ్డారు.సంపద సృష్టిస్తానని చెప్పి,ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సరిగా లేదనడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.