వేల్పుగొండలో చారిత్రక వైభవాన్ని పరిచయం చేసిన హెరిటేజ్ వాక్

*వేల్పుగొండలో చారిత్రక వైభవాన్ని పరిచయం చేసిన హెరిటేజ్ వాక్* *నాటి చరిత్రకు నేటి పర్యాటకుల చూపు* *చరిత్ర వైభవాన్ని తిలకించిన పర్యాటకులు* టేక్మాల్ సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి) మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో కాకతీయుల కాలం నాటి శ్రీ తుమ్మరేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం 'మెతుకుసీమ వైభవం' ఆధ్వర్యంలో బుర్ర సంతోష్ పర్యవేక్షణలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఆలయంలో వెలిసినటువంటి స్వయంభు లింగేశ్వరుని విగ్రహానికిఅర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ తుమ్మరేశ్వర స్వామి ఆలయ చారిత్రాత్మకమైన ప్రాదన్యాన్ని పర్యాటక...