prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 9:26 am Digital Edition : PRAJA VANI

వేల్పుగొండలో చారిత్రక వైభవాన్ని పరిచయం చేసిన హెరిటేజ్ వాక్

*వేల్పుగొండలో చారిత్రక వైభవాన్ని పరిచయం చేసిన హెరిటేజ్ వాక్*

*నాటి చరిత్రకు నేటి పర్యాటకుల చూపు*

*చరిత్ర వైభవాన్ని తిలకించిన పర్యాటకులు*

టేక్మాల్ సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి) మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో కాకతీయుల కాలం నాటి శ్రీ తుమ్మరేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం ‘మెతుకుసీమ వైభవం’ ఆధ్వర్యంలో బుర్ర సంతోష్ పర్యవేక్షణలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఆలయంలో వెలిసినటువంటి స్వయంభు లింగేశ్వరుని విగ్రహానికిఅర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ తుమ్మరేశ్వర స్వామి ఆలయ చారిత్రాత్మకమైన ప్రాదన్యాన్ని పర్యాటక బృందానికి వివరించి ప్రాంతంలోని చారిత్రాత్మక పురావస్తు సాంస్కృతిక సంపదను భావితరాలకు పరిచయం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరుడి దాసు, ఉప సర్పంచ్ ఎంపీ సుధాకర్, సిటిజన్స్ ఫోరమ్ అధ్యక్షులు కొండల్ రెడ్డి, పర్యాటక బృందం సభ్యులు, గ్రామ పెద్దలు లింగమయ్య, తుపాకీ ఆంజనేయులు, అబ్బనీ ప్రకాష్, మోహన గారి యాదగిరి, చకినాల రాజు, కళాలి సాకేత్ గౌడ్, మూడ వెంకటేశం, అంజయ్య, జట్టిగారి సాయిలు, మూడ అంజయ్య, బోయిని శ్రీకాంత్, దాసరి నాగరాజు, రాములు, దుర్గయ్య తదితరులు ఉన్నారు