వెంకట్రాంపురంలో ఘనంగా మహా అన్నదానం

వెంకట్రాంపురంలో ఘనంగా మహా అన్నదానం కూసుమంచి ప్రజావాణి – సెప్టెంబర్ 20 ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వెంకట్రాంపురం (చిన్న పోచారం) గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణనాథుడి దర్శనానికి వచ్చిన భక్తులు, గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఉదయం నుంచే కమిటీ సభ్యులు ఏర్పాట్లలో నిమగ్నమై, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతులు కల్పించారు. భక్తులకు క్రమబద్ధంగా భోజనం వడ్డిస్తూ...