prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 8:51 pm Digital Edition : PRAJA VANI

వెంకట్రాంపురంలో ఘనంగా మహా అన్నదానం

వెంకట్రాంపురంలో ఘనంగా మహా అన్నదానం
కూసుమంచి ప్రజావాణి – సెప్టెంబర్ 20
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వెంకట్రాంపురం (చిన్న పోచారం) గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణనాథుడి దర్శనానికి వచ్చిన భక్తులు, గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఉదయం నుంచే కమిటీ సభ్యులు ఏర్పాట్లలో నిమగ్నమై, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతులు కల్పించారు. భక్తులకు క్రమబద్ధంగా భోజనం వడ్డిస్తూ కమిటీ సభ్యులు సేవాభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమం సందర్భంగా గ్రామ వీధులు భక్తులతో సందడిగా మారాయి. అన్నదానానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సంతృప్తికరంగా భోజనం అందేలా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉదయం నుంచి శ్రమించిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను గ్రామస్థులు అభినందించారు. గణనాథుడి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ఆకాంక్షించారు.