వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
వెంకటాపురం, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని వెంకటాపురం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ స్వయంభూ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ, నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు, కేశపావుల మల్లికార్జున్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని వితరణ చేశారు. ముందుగా స్వామివారికి పల్లకి సేవ నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్...