prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 4:05 pm Digital Edition : PRAJA VANI

వీరనారి చాకలి ఐలమ్మ 131జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

వీరనారి చాకలి ఐలమ్మ 131జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

సెప్టెంబర్ 26 ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం: మండలంలోని గవి చర్ల.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. మహిళలు సైతం అన్యాయాన్ని ఎదిరించి హక్కుల కోసం పోరాడగలరని ఐలమ్మ నిరూపించారని పేర్కొన్నారు.
ఐలమ్మ ధైర్యసాహసాలు, ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
కార్యక్రమంలో నాయకులు, మార్కెట్ డైరెక్టర్ నాగరాజ్.బాష్పాక సదయ్య సర్పంచ్. ఉప సర్పంచ్ సంపత్. కార్యదర్శి శరత్ కుమార్. రజక సంఘం అధ్యక్షులు ముప్పు రమేష్. గ్రామ పార్టీ అధ్యక్షులు రావుల రామకృష్ణ. రజక సంఘం అందరూ పాల్గొని ఉత్సాహంగా గ్రామపంచాయతీ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు జయంతి వేడుకలు.సంగెం లో నిర్వహించినగౌరవాధ్యక్షులు మునుకుంట్ల మోహన్. కోటి. అలుగునూరి రమేష్. ముప్పు నాగేష్.ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత, గ్రామస్తులు పాల్గొని వీరనారి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.