వీబీజీ రామ్ జీ కార్యాలయంలో అరకొర వసతులు – అధికారుల నిర్లక్ష్యం

*వీబీజీ రామ్ జీ కార్యాలయంలో అరకొర వసతులు - అధికారుల నిర్లక్ష్యం* *రాయికల్, సెప్టెంబర్ 20 (ప్రజావాణి):* పేదలకు ఉపాధి కల్పించి ఆదుకోవాల్సిన కార్యాలయమే నేడు ప్రమాదాలకు నిలయంగా మారింది. రాయికల్ పట్టణంలోని వీబీజీ రామ్ జీ కార్యాలయ దుస్థితి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. నిధులు లేక, పట్టించుకునే నాథుడు లేక భవనం పూర్తిగా అద్వాన్న స్థితికి మారింది. *విరిగిన తలుపులు.. జారుడు మెట్లు:* కార్యాలయ ప్రధాన ద్వారం, గదుల తలుపులు విరిగిపోయి వేలాడుతున్నాయి. పై అంతస్తుకు వెళ్లే మెట్లపై కప్పిన ఇనుప...