prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 3:59 pm Digital Edition : PRAJA VANI

విశ్వబ్రాహ్మణ పీఠం కరీంనగర్ జిల్లా బాధ్యులుగా నారోజు శంకరాచారి

విశ్వబ్రాహ్మణ పీఠం కరీంనగర్ జిల్లా బాధ్యులుగా నారోజు శంకరాచారి

సామాజిక సేవకు గుర్తింపుగా బాధ్యతలు

గుగ్గిళ్ల గ్రామస్తులు, విశ్వబ్రాహ్మణ సమాజం హర్షం

బెజ్జంకి, సెప్టెంబర్ 13 (ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ధర్మ పీఠం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులుగా నారోజు శంకరాచారి ఎంపిక కావడంతో గుగ్గిళ్ల గ్రామస్తులు, విశ్వబ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు సివిల్స్‌పై అవగాహన కల్పిస్తూ ఉచిత శిక్షణ అందిస్తున్నారని తెలిపారు.

‘నా గమ్యం ఐఏఎస్’ పుస్తక రచయితగా గుర్తింపు

నారోజు శంకరాచారి రచించిన ‘నా గమ్యం ఐఏఎస్’ పుస్తకం తెలుగు మాధ్యమ విద్యార్థులకు సివిల్స్‌పై అవగాహన కల్పించే కరదీపికగా నిలుస్తోందన్నారు. ఆయన శిక్షణతో పలువురు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు.
కొత్త బాధ్యతలతో సామాజిక, విద్యా సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ శంకరాచారికి గ్రామస్తులు, విశ్వబ్రాహ్మణ సమాజ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.