prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 4:54 pm Digital Edition : PRAJA VANI

విశ్వకర్మ జయంతి ఉత్సవ వేడుకలు

విశ్వకర్మ జయంతి ఉత్సవ వేడుకలు.
పూల మాలలు వేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -17:
యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం రోజున నిర్వహించగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, బీసీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా విశ్వకర్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, విరాట్ విశ్వకర్మ దైవ రూపంగా, ఆధ్యాత్మికతో, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సిపిఓ శ్రీనివాస్ చారి, డి.ఎస్.పి నాగేంద్ర చారి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సురేష్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, కాంభోజ ముత్యం, బ్రహ్మచారి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, విశ్వకర్మ కుల సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.