విలేకరిపై దురుసు ప్రవర్తన.. పోలీస్ అధికారుల మౌనం ఎందుకు?
“విలేకరిపై దురుసు ప్రవర్తన.. పోలీస్ అధికారుల మౌనం ఎందుకు?• స్పందించని పోలీస్ సిబ్బంది... ఏఎస్ఐ రాములు పై చర్యలు ఎప్పుడు?మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 08 ( చిలిపి చెడ్) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్నప్పటికీ పోలీసులు ఆపి ప్రశ్నించడంతో పాటు ఓ విలేకరిపై పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు ఫిర్యాదుదారుల...