“విలేకరిపై దురుసు ప్రవర్తన.. పోలీస్ అధికారుల మౌనం ఎందుకు?
• స్పందించని పోలీస్ సిబ్బంది… ఏఎస్ఐ రాములు పై చర్యలు ఎప్పుడు?
మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 08 ( చిలిపి చెడ్) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్నప్పటికీ పోలీసులు ఆపి ప్రశ్నించడంతో పాటు ఓ విలేకరిపై పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు ఫిర్యాదుదారుల సమస్యలపై గౌరవంగా స్పందించాల్సిన బాధ్యత ఉందని పోలీస్ శాఖ మార్గదర్శకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
విలేకరితో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించడంతో పాటు, తప్పు జరిగితే ఏఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు, ప్రజలు కోరుతున్నారు. ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.