వినాయక విగ్రహాల షాపు వద్ద 30 వేల నగదు అపహరణ

వినాయక విగ్రహాల షాపు వద్ద 30 వేల నగదు అపహరణ జమ్మికుంట సెప్టెంబర్ 14 (ప్రజావాణి) జమ్మికుంటలోని వినాయక విగ్రహాల షాపు వద్ద బైక్పై ఉంచిన రూ.30 వేల నగదును ఓ మైనర్ బాలుడు దొంగిలించాడు. గమనించిన స్థానికులు బాలుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గతంలోనూ ఇదే కాంప్లెక్స్లోలోని సెలూన్ షాపులో ఈ బాలుడే చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే బాలుడు ఈ తప్పు చేశాడని తేలడంతో అతనికి, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సీఐ రామకృష్ణ...