prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 10:28 am Digital Edition : PRAJA VANI

వినాయక విగ్రహాల షాపు వద్ద 30 వేల నగదు అపహరణ

వినాయక విగ్రహాల షాపు వద్ద 30 వేల నగదు అపహరణ

జమ్మికుంట సెప్టెంబర్ 14 (ప్రజావాణి)

జమ్మికుంటలోని వినాయక విగ్రహాల షాపు వద్ద బైక్పై ఉంచిన రూ.30 వేల నగదును ఓ మైనర్ బాలుడు దొంగిలించాడు. గమనించిన స్థానికులు బాలుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గతంలోనూ ఇదే కాంప్లెక్స్లోలోని సెలూన్ షాపులో ఈ బాలుడే చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే బాలుడు ఈ తప్పు చేశాడని తేలడంతో అతనికి, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు