వినాయక విగ్రహాల వద్ద సాయిపేట శ్రీనివాస్ ప్రత్యేక పూజలు
గణపయ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలి సాయిపేట శ్రీనివాస్*
గుండ్లపోచంపల్లి 299 డివిజన్ వార్త:_వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్, 299 డివిజన్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కండ్లకోయ, సుతారిగూడ, గుండ్లపోచంపల్లి, లక్ష్మీనగర్ కాలనీ, కె.వి.రెడ్డి కాలనీ, అంతం విలాస్, సన్యూగా అపార్ట్మెంట్, ఏజీ కాలనీ, నైబర్‌హుడ్, ఊర్జిత్ విల్లాస్, సంజన అపార్ట్మెంట్, స్టెర్లింగ్ అపార్ట్మెంట్, స్టెర్లింగ్ విల్లాస్ తదితర కాలనీలలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య విగ్రహాలను దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిపేట శ్రీనివాస్ మాట్లాడుతూ.. వినాయకుడి అనుగ్రహంతో 299 డివిజన్ పరిధిలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని గణపయ్యను ప్రార్థించినట్లు తెలిపారు. విఘ్నాలను తొలగించి ప్రజల జీవితాల్లో సంతోషం, అభివృద్ధి, ఐశ్వర్యం కలిగించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
వినాయక చవితి సందర్భంగా కాలనీలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు.
అలాగే గణేష్ మండపాల నిర్వాహకులు, యువజన సంఘాల సభ్యులు, కాలనీ వాసులు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. గణపయ్య ఆశీస్సులతో 299 డివిజన్ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని సాయిపేట శ్రీనివాస్ ఆకాంక్షించారు.