వినాయక మండపాల్లో జి.రవి ముదిరాజ్ ప్రత్యేక పూజలు

వినాయక మండపాల్లో జి.రవి ముదిరాజ్ ప్రత్యేక పూజలు గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ, కండ్లకోయ, ఆర్కెలగూడెంలో గణనాథుడి దర్శనం గుండ్లపోచంపల్లి: (ప్రజావాణి) గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ, కండ్లకోయ, ఆర్కెలగూడెంలో చేసిన వినాయక మండపాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు జి.రవి ముదిరాజ్ సందర్శించారు. ఆయా మండపాల్లో కొలువుదీరిన శ్రీ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించారు. అనంతరం మండపాల వద్ద నిర్వహించిన...