prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 5:06 pm Digital Edition : MAHESH MEDCHAL

వినాయక మండపాల్లో జి.రవి ముదిరాజ్ ప్రత్యేక పూజలు

వినాయక మండపాల్లో జి.రవి ముదిరాజ్ ప్రత్యేక పూజలు

గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ, కండ్లకోయ, ఆర్కెలగూడెంలో గణనాథుడి దర్శనం

గుండ్లపోచంపల్లి: (ప్రజావాణి) గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ, కండ్లకోయ, ఆర్కెలగూడెంలో చేసిన వినాయక మండపాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు జి.రవి ముదిరాజ్ సందర్శించారు. ఆయా మండపాల్లో కొలువుదీరిన శ్రీ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద నిర్వహించిన

పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించారు.

అనంతరం మండపాల వద్ద నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవాల నిర్వహణ, భక్తుల ఏర్పాట్లను పరిశీలిస్తూ కమిటీ సభ్యులతో మాట్లాడారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరస్వామి, వెంకటేష్, వినాయక కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల పెద్దలు, కాలనీవాసులు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.