వినాయక మండపం వద్ద విషాదం: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి, మరొకరికి గాయాలు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. వినాయక మండపం వద్ద నిర్వహించిన దీపారాధన కార్యక్రమంలో విద్యుత్ షాక్ తగిలి మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో అఖిల్ అనే మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, మధు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అఖిల్‌కు చికిత్స అందిస్తున్నారు.