వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మండల స్థాయి అధికారులు

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మండల స్థాయి అధికారులు ప్రజావాణి శాయంపేట: మండల పరిధిలోని వినాయక నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని శాయంపేట మండలంలో భద్రతా ఏర్పాట్లను మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రగతి సింగారం వద్ద గల చలివాగు ప్రాజెక్టు బ్రిడ్జి, అలాగే శాయంపేట గ్రామ పరిధిలోని దేవుని కుంట, తాళ్ళ కుంటలను అధికారులు పరిశీలించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రమాదాలు జరగకుండా బారికేడ్ల ఏర్పాటు, తగినంత వెలుతురు కోసం విద్యుత్ దీపాలు,...