prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:23 am Digital Edition : PRAJA VANI

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మండల స్థాయి అధికారులు

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మండల స్థాయి అధికారులు

ప్రజావాణి శాయంపేట:

మండల పరిధిలోని వినాయక నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని శాయంపేట మండలంలో భద్రతా ఏర్పాట్లను మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రగతి సింగారం వద్ద గల చలివాగు ప్రాజెక్టు బ్రిడ్జి, అలాగే శాయంపేట గ్రామ పరిధిలోని దేవుని కుంట, తాళ్ళ కుంటలను అధికారులు పరిశీలించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రమాదాలు జరగకుండా బారికేడ్ల ఏర్పాటు, తగినంత వెలుతురు కోసం విద్యుత్ దీపాలు, క్రేన్ల ఏర్పాటు మరియు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో సీఐ సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ పరమేశ్వర్, ఎంపీడీవో ఫణి చంద్ర, టీజీఎన్‌పీడీసీఎల్ ఏఈ చొక్కారావు ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీసు మరియు రెవెన్యూ శాఖల నిబంధనలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు.