వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కౌన్సిలర్లు
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కౌన్సిలర్లు ఎల్లంపేట: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని మల్కా చెరువులో వినాయక నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లను కౌన్సిలర్లు ముత్యాల గౌడ్, ఆరిఫ్, విఘ్నేశ్వర్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు, మండప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెరువు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేసినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం సురక్షితంగా నిర్వహించేందుకు వీలుగా చెరువు పరిసరాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్లు తెలిపారు. నిమజ్జన సమయంలో భక్తులు, నిర్వాహకులు...