వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి యనమల సుధాకర్
పోరుమామిళ్ల సెప్టెంబర్ 13 ప్రజావాణి పట్టణంలోని మల్లకత్తువ వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మల్లకత్తువ పరిసర ప్రాంతాల్లో ఉన్న కంప చెట్లను జెసిబి యంత్రాల సహాయంతో తొలగించి, నిమజ్జన మార్గాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దు తున్నారు.ఈ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, పోరుమామిళ్ల మాజీ సర్పంచ్ యనమల సుధాకర్ పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులు, వినాయక విగ్రహాలను తరలించే నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా...