prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:10 pm Digital Edition : PRAJA VANI

వినాయక నిమజ్జనంలో విషాదం:ఇద్దరు యువకుల మృతి

వినాయక నిమజ్జనంలో విషాదం:ఇద్దరు యువకుల మృతి
మృతుల కుటుంబాలకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సానుభూతి

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూoపల్లి మండలంలోని రుద్రారం గ్రామం లో నిన్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో జరిగిన విషాదకర ఘటనతో ఊరు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువులో మునిగి పార రమేష్,కళాల నవీన్ మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.ఈ పెను విషాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబ సభ్యులు,బంధువులు,స్నేహితులకు తీరని లోటు అని పేర్కొన్నారు. వారి పార్థివ దేహాలకు నివాళులు అర్పించారు.ఈ విషాద సమయంలో మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, నీటి వనరుల వద్ద నిమజ్జనం సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుండా శంకర్, సిద్దిపేట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఏలూరు కమలాకర్,తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కో ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, నాయకులు మండల నర్సింలు యాదవ రెడ్డి కుమార్ sc సెల్ మండల అధ్యక్షుడు మండల కుమార్ మాజీ ఎంపీటీసీ నర్సింలు, యాదవరెడ్డి,బొప్పాపూర్ దుబ్బా రాజం,పోతారం రాజు,స్వామి తదితరులు పాల్గొన్నారు.