prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:04 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

వినాయక నవరాత్రి ఉత్సవాల లో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం

వినాయక నవరాత్రి ఉత్సవాల లో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం

టిపిసీసీ వైస్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి

 

అధిక సంఖ్యలో హాజరైన మహిళా మణులు

తొర్రూర్
సెప్టెంబర్ 20

తొర్రూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం గణనాధునికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై, పురోహితుల వేదం మంత్రోచ్ఛారణతో అమ్మవారికి, ప్రత్యేక పూజ నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమానికి అనేకమంది మహిళా నాయకులు కార్యకర్తలు హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చన పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు పాడి పంటలు పుష్కలంగా గణనాథుడు, అమ్మవారు ప్రసాదించాలని ఆమె వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.