వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జరుపుకోవాలి: పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ సుందర్ రావు పిలుపు

పోరుమామిళ్ల పోలీస్ సెప్టెంబర్ 14 ప్రజావాణి సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ (సి.ఐ) హేమ సుందర్ రావు  తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించి, సకల శుభాలను, విజయాలను ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సంతోషంగా, ఆరోగ్యంగా మరియు ఐక్యతతో జరుపుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ హేమ సుందర్...