వినాయక ఉత్సవాలకు పోలీసు అనుమతులు తీసుకోవాలి ..
కాశీబుగ్గ డిఎస్పీ భవానీ
పలాస ప్రజావాణి ప్రతినిధి
పలాస సబ్ డివిజన్ లో వినాయక చవితి ఉత్స వాలకు పోలీసు అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని కాశీబుగ్గ డీఎస్పీ భవానీ స్పష్టం చేశారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో ఆమే మాట్లాడుతూ సింగల్ విండో సిస్టం ద్వారా అనుమతులు తీసుకోవాలని అన్నారు. భక్తిశ్రద్ధలతో, పరస్పర అంగీకారంతో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ఆమె సూచించారు. రాత్రి 10 గంటలు నుంచి ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దం కలిగిన స్పీకర్లు , డీజేలు వాడవద్దని సూచించారు. డీఎస్పీ తో పాటు కాశీబుగ్గ సీఐ గ్రంథము.రామకృష్ణ ఉన్నారు.