వినాయకుని దర్శించుకున్న రెడ్డిపల్లి సర్పంచ్ నరసింహ
ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం
చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వినాయకుని దర్శించుకొని,అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నరసింహ.ఈ సందర్భంగా సర్పంచ్ నరసింహ మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి,వార్డు సభ్యులు శంభుని హరి,స్వామి, తిగుల దాము,గ్రామ ప్రజలు ఆంజనేయులు, క్రిష్ణ, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.