prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:05 pm Digital Edition : MAHESH MEDCHAL

వినాయకుడి సన్నిధిలో మేడ్చల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్*

*వినాయకుడి సన్నిధిలో మేడ్చల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్*

*లంబోదర యూత్ అసోసియేషన్ మండపంలో మాజీ వైస్ చైర్మన్ చిర్ల రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు*

మేడ్చల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ డివిజన్‌లో లంబోదర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ వారి తనయుడు ఆకాష్ ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీర్ల రమేష్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతతో పండుగను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యువతలో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాలు కూడా మన సంప్రదాయాలు, సంస్కృతిని కొనసాగిస్తూ వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. తనను లంబోదర యూత్ అసోసియేషన్ మండపానికి ఆహ్వానించి పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావుకు శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి కలగాలని గణనాథుడిని ప్రార్థించారు. అనంతరం ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావు, నర్సింగరావు వై. నాగేందర్, వి. నాగేందర్ చీర్ల రమేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వినాయక మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్థానిక యువత సమష్టిగా ముందుకు వచ్చి ఉత్సవాలను నిర్వహించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్, సన్నీ యాదవ్, క్రాంతి, శివ, అభయ్ సింగ్, నితిన్ కుమార్, నవీన్, మురళి, అక్షిత్, ప్రభు తదితరులతో పాటు లంబోదర యూత్ అసోసియేషన్ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు, ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.