prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 3:06 pm Digital Edition : MAHESH MEDCHAL

వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

మేడ్చల్, ఎల్లంపేట ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి

ప్రజావాణి సెప్టెంబర్ 14:- వినాయక .చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని , ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. వినాయక చవితి పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ, సాధ్యమైనంత వరకు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు.

విఘ్నేశ్వరుడి కృపతో మేడ్చల్ మండలం, ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలు వెల్లివిరియాలని మేకల రజిత దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు.