విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం పోత్కపల్లి: విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యా సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అల్పాహార కార్యక్రమాన్ని పోత్కపల్లి పాఠశాలలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ పోత్కపల్లి గ్రామ సర్పంచ్ ఆంబాల సారమ్మ, ఉపసర్పంచ్ రెడ్డి రజనీకాంత్, వార్డు సభ్యులు, పాఠశాల ఏఏపీసీ (AAPC) చైర్మన్ పిట్టల మమత, ఏఏపీసీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది హాజరై విద్యార్థులకు అల్పాహారాన్ని అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం...